అండర్ 19 స్కూల్ గేమ్స్  సాఫ్ట్బాల్ పోటీలకు స్వప్న ఎంపిక..

నవతెలంగాణ-  డిచ్ పల్లి

డిచ్ పల్లి మండలంలోని ధర్మారం తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల కు చెందిన విద్యార్థిని స్వప్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికైందని ప్రిన్సిపల్ సంగీత ఆదివారం తెలిపారు. గత నెలలోౠ సిద్దిపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలలో మంచి ప్రతిభను కనబరిచి మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ లో నిర్వహించే 29 నుండి 1వరకు జరగబోయే జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలలో పాల్గొంటుందని అమె తెలిపారు. విద్యార్థిని స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ నీరజా రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ కిషన్, పిఈటీ జోష్ణ, హౌస్ టీచర్స్ చేనకేశ్వరి అభినందించారు.