అంబేద్కర్ అభయ హస్తం కింద ప్రతి దళిత కుటుంబానికి రూ.12 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలి..

Under Ambedkar Abhaya, financial assistance of Rs 12 lakh will be given to every Dalit family.నవతెలంగాణ – జన్నారం
అంబేద్కర్ అభయ హస్తం కింద ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని,బిజెపి ఎస్సీ మోర్చా మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు కొండ నరేష్ జన్నారం మండల సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ అన్నారు.  బుధవారం మండల తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డికి బిజెపి దళిత మోర్చా ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేవెళ్ల నిర్వహించిన ఎస్సీ డిక్లరేషన్లో ఇచ్చిన ప్రధాన హామీలైన అంబేద్కర్ అభయహస్తం, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధికి రుణాలు, షెడ్యూల్డ్ కులాల సాంఘిక సంక్షేమ వసతి గృహాల పునః నిర్మాణం తదితర అంశాలకు రాష్ట్ర బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించకపోవడాన్ని నిరశిస్తున్నాం అన్నారు. అంబేద్కర్ అభయహస్తం కింద ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలన్నారు. ఎస్సీ ఉప కులాలు, మాల మరియు మాదిగ కార్పొరేషన్లకు సంవత్సరానికి రూ.750 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రతి ఎస్సీ కుటుంబానికి శాశ్వత ఇళ్లు నిర్మాణానికి రూ. 5 లక్షలు ఆర్థిక సహాయం అందజేయాలన్నారు. ఎస్సీ హాస్టల్స్ పునః నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే కేటాయించాలన్నారు.  ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యువతకు స్వయం ఉపాధికై సబ్సిడీ రుణాలకు సంవత్సరానికి రూ.1000 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు వీరాచారి మహేష్ తదితరులు పాల్గొన్నారు.