నిజామాబాద్ మెడికవర్ ఆసుపత్రి వారి సౌజన్యంతో ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసే భారికేడ్లేను శుక్రవారం ట్రాఫిక్ ఏసీపీకి అందజేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని ట్రాఫిక్ పోలీసులకు 50 భారికేడ్లను ఇవ్వటం జరిగినది. మెడికవర్ ఔట్ పేషంట్ ప్రాంగణము నందు ఆసుపత్రి యాజమాన్యం తరపున ఆసుపత్రి హెడ్ స్వామి ట్రాఫిక్ ఏసిపి నారాయణ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ ప్రసాద్ ఎస్సైలు ట్రాఫిక్ సిబ్బంది, మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.