హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలోనే..

హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలోనే..– టీ20 ప్రపంచకప్‌ భారత జట్టు ఎంపిక
ముంబయి : భారత్‌ మరోసారి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోనే పొట్టి ప్రపంచకప్‌ వేట సాగించనుంది. అక్టోబర్‌ 3 నుంచి యుఏఈలో జరుగనున్న మహిళల ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పోటీపడే భారత జట్టును బీసీసీఐ మహిళల సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ మంగళవారం ఎంపిక చేసింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్‌గా ఎంపిక కాగా, స్మృతీ మంధాన వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. 15 మందితో కూడిన జట్టుతో పాటు ముగ్గురు రిజర్వ్‌ ప్లేయర్లను సైతం ఎంపిక చేశారు. మహిళల ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌-ఏలో ఆస్ట్రేలియా, భారత్‌, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక ఉండగా.. గ్రూప్‌-బిలో బంగ్లాదేశ్‌, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, స్కాట్లాండ్‌ చోటుచేసుకున్నాయి. గ్రూప్‌ దశలో ప్రతి జట్టు నాలుగు మ్యాచులు ఆడుతుంది. టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి.
భారత మహిళల జట్టు : హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతీ మంధాన (వైస్‌ కెప్టెన్‌), షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రొడ్రిగస్‌, రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), యస్టికా భాటియా (వికెట్‌ కీపర్‌), పూజ వస్ట్రాకర్‌, అరుంధతి రెడి, రేణుక సింగ్‌ ఠాకూర్‌, హేమలత, ఆశ శోభన, రాధ యాదవ్‌, శ్రేయాంక పాటిల్‌, సజీవన్‌. (ట్రావెలింగ్‌ రిజర్వ్స్‌ : ఉమా, తనూజ, సైమా)