కమ్మోరి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్లెక్సీకి పాలాభిషేకం

నవతెలంగాణ – అశ్వారావుపేట
కమ్మ కార్పోరేషన్ ఏర్పాటు పై హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక కమ్మ సామాజిక వర్గం ప్రముఖులు శుక్రవారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని మూడు రోడ్ ల ప్రధాన కూడలి లో సీఎం రేవంత్ రెడ్డి ప్లెక్సీ కి పాలాభిషేకం చేసారు. కమ్మ కార్పొరేషన్ కోసం కృషి చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంట్ సభ్యురాలు రేణుక చౌదరి లకు అశ్వారావుపేట కమ్మ సంఘం తరపున కృతజ్ఞత తెలిపారు. ఎన్నో సంవత్సరాలు కమ్మ సామాజిక వర్గం లో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలు విద్య, వైద్యానికి నోచుకోకుండా ఇబ్బంది పడుతున్నారు అనే సంగతిని గుర్తించి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి చొరవతో ఎలాంటి రిజర్వేషన్ లేని ఈ కమ్మ కులానికి ఇప్పుడైనా మేలు జరుగుతుందని స్థానిక ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేద,మధ్యతరగతి కమ్మ లను దృష్టిలో ఉంచుకొని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి నేడు కమ్మ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి కి అశ్వారావుపేట కమ్మ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొగళ్ళపు చెన్నకేశవరావు,జేష్ఠ సత్యనారాయణ చౌదరి,సుంకవల్లి వీరభద్ర రావు,కాసాని వెంకటేశ్వరావు, కమ్మ సంఘం అధ్యక్షులు సంకురాత్రి సతీష్,తలసిల ప్రసాద్,అల్లూరి బుజ్జి, ఆండ్రు ప్రసాద్,కమ్మ సామాజిక వర్గ పెద్దలు,యూనియన్ సభ్యులు, తుమ్మల అభిమానులు పాల్గొన్నారు.