
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి ప్రభుత్వం ఐటిఐ దగ్గర నేషనల్ హైవే రామకృష్ణాపురం పెంచికల్ పహాడ్ తో పాటు ఇతర గ్రామాలకు వెళ్లడానికి అండర్పాస్ రోడ్ నిర్మాణం చేయాలని ఈరోజు శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అండర్ పాస్ నిర్మాణ సాధన కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, నిర్మాణ సాధన కమిటీ కన్వీనర్ సిల్వర్ ఎల్లయ్య మాట్లాడుతూ
భువనగిరి ప్రభుత్వ ఐటిఐ దగ్గర రామకృష్ణాపురం పెంచికల్ పహాడ్ నుండి వేములకొండ వరకు భువనగిరి వలిగొండ ఆత్మకూరు మోటకొండూరు నాలుగు మండలాలకు సంబంధించిన 40 గ్రామాల ప్రజలు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రమైన తరువాత ఇతర ప్రాంతాల నుండి విద్య వైద్యం ఉపాధి వ్యాపారాలు వివిధ వృత్తులు కు సంబంధించిన వారు రైతులు రోజువారి అవసరాల కోసం పలువురు నేషనల్ హైవే ను దాటి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు హైవే దాటడానికి సరైన రోడ్డు మార్గం లేక ప్రమాదాలకు గురై వందలాదిమంది ఇప్పటికే ప్రాణాలు పోగొట్టుకొని కాళ్లు చేతులు విరిగి వికలాంగులుగా మారి ఆర్థికంగా చిక్కిపోయి ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డా పరిస్థితి ఉన్నది ఈ ప్రాంత వాసులు బుగ్గ కిష్టయ్య చీమలకొండూరు దయ్యాల బాలరాజు కేర్చిపళ్లి జీ సత్తిరెడ్డి పోచంపల్లి వారు మరణించడం జరిగింది. వీరితోపాటు వివిధ ప్రాంతాల వారు మరో 14 మంది మరణించారు. సుమారు 80 మంది అంగవైకల్యంతో వికలాంగులుగా మారినారు. పలుమార్లు ప్రజలు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు ఆందోళనలు పోరాటాలు నిరసన దీక్షలు ధర్నాలు చేపట్టి అధికారుల ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది నేటికి సమస్య పరిష్కారం గాక అనేక మంది ప్రాణాలు కోల్పోవుచున్నారు. ఈ సందర్భంగా భువనగిరి ప్రభుత్వ ఐటిఐ దగ్గర నేషనల్ హైవే దాటి రామకృష్ణాపురం పెంచికల్పహాడ్లతోపాటు నాలుగు మండలాలు ఇతర గ్రామాలకు వెళ్లడానికి అండర్పాస్ రోడ్డు నిర్మాణం తక్షణమే చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని వారు డిమాండ్ చేశారు.