టీడీఎస్, టిసిఎస్ పై అవగాహన..

– అవగాహన కలిగించిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారులు
– పాల్గొన్న జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్
నవతెలంగాణ -నల్గొండ కలెక్టరేట్ 
టీడీఎస్, టిసిఎస్ ల పై  వివిధ శాఖల డి డి ఓ  లకు, ట్రెజరీ శాఖ అధికారులకు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారులు అవగాహన కలిగించారు.
ఐఆర్ఎస్ అధికారులు కె. మేఘనాథ్ చౌహాన్, కమిషనర్ ఇన్ కమ్ టాక్స్, టిడిఎస్. అరవిందక్షన్, అదనపు కమిషనర్, ఇన్ కమ్ టాక్స్, రేంజ్ 2, హైద్రాబాద్, అదితి గోయల్, జాయింట్ కమిషనర్ ఆప్ ఇన్ కమ్ టాక్స్, డా.పి.సుధాకర్ నాయక్,ఇన్ కమ్ టాక్స్ డిప్యూటీ కమిషనర్ లు టిడిఎస్, టిసిఎస్ పై   అవగాహన  కలిగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్ పాల్గొన్నారు. శనివారం  కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్ లో వివిధ శాఖలకు చెందిన డిడివో లకు టీడీఎస్ (టాక్స్ డిటెక్ట్ సోర్స్) టి సి ఎస్ (టాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) విధానాల పై  వారు  అవగాహన కలిగించారు.   ఉద్యోగులకు సంబంధించిన టిడిఎస్,టి సి.ఎస్.రిటర్న్ దాఖలు చేసేప్పుడు స్వయంగా అవగాహన కలిగి ఉండాలని అన్నారు.డిడిఓ లు టిడిఎస్, టిసిఎస్ లు ,వార్షిక ఆదాయ రిటర్న్ లు దాఖలు చేసేప్పుడు అన్ని వివరాలు థర్డ్ పార్టీ ద్వారా చేయడం జరుగుతుందని,వారి ద్వారా రిటర్న్ లో  సమస్యలు,అవకతవకలు,దుర్వినియోగం  జరగ కుండా ఈ విషయంలో డిడివోలు, టిడిఎస్ రిటర్న్స్ చేసినకా మరొకసారి రికన్సిలేషన్ ద్వారా ఆ వివరాలను విధిగా చెక్ చేయాల్సిందిగా ఆయన సూచించారు. ఇటీవల  కొన్ని అవకతవకలు సంఘట నలు కొన్ని ప్రాంతాల్లో వెలుగు చూ సాయని తెలిపారు. 24జి స్టేట్ మెంట్, టిడిఎస్, టిసిఎస్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇక కార్యాలయాలకు సంబంధించిన చెల్లింపులలో భాగంగా టిసిఎస్ చేసేటప్పుడు వాటికి సంబంధించిన జిఎస్టి, టాన్, బిన్, పాన్, మొదలగు నెంబర్లను సరిచూసుకొని చెల్లింపులు చేయాలని తెలిపారు. అధికారులు ఇకనుండి అయినా తమ ఆదాయ పన్ను వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలన్నారు. ఇ- ఫైలింగ్ సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. అన్ని విషయాలకు సంబంధించిన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించి అవగాహన కలిగించారు. అంతకుముందు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా ఐఅర్ఎస్ అధికారులు రెండు బృందాలుగా స్వచ్ఛత హే సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.   నకిరేకల్ లోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ స్కూలులో పాఠశాల పరిశుభ్రత, మన పరిసరాల పరిశుభ్రత పై  ఇన్కమ్ టాక్స్ కమిషనర్ మేఘనాథ్ చౌహన్, అడిషనల్ కమిషనర్ అరవిందాక్షన్ లు అవగాహన కలిగించారు. అదేవిధంగా 2వ టీమ్ నార్కెట్పల్లిలోని వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ పాఠశాలలో స్వచ్ఛత హీ సేవలో భాగంగా విద్యార్థులకు  ఇన్కమ్ టాక్స్ జాయింట్ కమిషనర్  అజిత్ గోయల్ , డిప్యూటీ కమిషనర్ సుధాకర్ నాయక్ లు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాలలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.