ఈనెల 20న నూలిపురుగుల దినోత్సవం పురస్కరించుకొని చిన్నారులకు ఆల్బెండ జోల్ మాత్రలు ఇలా పంపిణీ చేయాలి అనే అంశంపై డాక్టర్ వినయ్ కుమార్ అవగాహన కల్పించారు. శుక్రవారం రెంజల్ మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధ్యాయులు, అంగన్వాడి కార్యకర్తలకు, వైద్య సిబ్బందితో అవగాహన కల్పించారు. మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలతో పాటు, అంగన్వాడి చిన్నారులందరికీ ఆల్బొండ జోల్ మాత్రలను అందించాలని ఆయన పేర్కొన్నారు. ఒకటి నుంచి 19 సంవత్సరాల లోపు వయస్సు గల చిన్నారులందరికీ ఈ మాత్రలను పంపిణీ చేయాలన్నారు. ఒకటి నుంచి రెండు సంవత్సరాల మధ్య వయసు గల వారికి సగం మాత్ర, మూడు నుంచి 19 సంవత్సరాల వయసు గల వారందరికీ ఒక మాత్ర చొప్పున పంపిణీ చేయాలని ఆయన సూచించారు. రెంజల్ మండలంలో ఒకటి నుంచి 19 సంవత్సరాల వయస్సు గల వారు బాలురు 52 82, బాలికలు 4691, ఉన్నారని వారందరికీ ఈ మాత్రలను పంపిణీ చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, సూపరిండెంట్ శ్రీనివాస్, ఆరోగ్య విస్తే నా అధికారులు కరిపే రవీందర్, చింతల శ్రావణ్ కుమార్, ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి, ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, గణేష్ రావు, ఆరోగ్య కార్యకర్తలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.