నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్‌జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థల్లో డైరెక్టర్ల నియామకాన్ని చేపట్టాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఏఎమ్ రిజ్వీ ఆదేశించారు. ఈ మేరకు ఆ సంస్థల సీఎమ్‌డీలకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లలో ఎక్కువమంది నిబంధనలకు విరుద్ధంగా సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నారనీ, వారి స్థానంలో కొత్త వారి నియామకం చేపట్టాలని పేర్కొన్నారు. టీఎస్ ట్రాన్స్‌కోలో ఐదుగురు, టీఎస్ జెన్‌కోలో ఆరుగురు డైరెక్టర్ల నియామకం చేపట్టాల్సి ఉందని తెలిపారు. ఆ ఉత్తర్వుల ప్రతిని ముఖ్యమంత్రి కార్యాలయానికీ, విద్యుత్‌శాఖ మంత్రి కార్యాలయానికి పంపారు. విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ల పదవీకాలం రెండేండ్లు మాత్రమేననీ, ఆ తర్వాత గరిష్టంగా మరో రెండేండ్లు మాత్రమే పొడిగించే అవకాశం ఉన్నదని వివరించారు. కానీ ప్రస్తుత డైరెక్టర్లలో అనేకమంది 9 ఏండ్లకు పైగా అదే పోస్టులో కొనసాగుతున్నారని పేర్కొంటూ జాబితాను జోడించారు.