భారీ వర్షాలకు గండి పడ్డ పెద్దవాగు ప్రాజెక్ట్ కు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ అశ్వారావుపేట నియోజక వర్గం ఇంచార్జి కట్రం స్వామి దొర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. మండల పరిధిలోని గుమ్మడి వల్లి పెద్దవాగు ప్రాజెక్ట్ గండిని శుక్రవారం పరిశీలించారు.దాని ముంపుకు గురైన సాగు భూములను సందర్శించి,నిర్వాసితులను ఆయన పరామర్శించారు. తక్షణమే ప్రభుత్వం మరమ్మత్తులు చేసి రైతులకు భూములకు నీరు అందించి పంటలు పండించు కోవడానికి చేయూత నివ్వాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీ మండల అధ్యక్షులు నార్లపాటి శ్రీనివాసరావు,మహిళా నాయకురాలు బొడ్డపాటి రమాదేవి,అంకోలు వెంకటేశ్వరరావు,పోతురాజు నాని,రమాదేవి,తుమ్మల నాగేశ్వరరావు,అనపర్తి శ్రీనివాస్ రావు,డికొండ వెంకన్న, బ్రహ్మేంద్రరావు,నర్రా రాకేష్, గుణ్ణం సురేష్,బుచ్చిరాజు, కిషోర్,రమేష్,సురేష్,గన్మెన్ (సాయిల వెంకటేశ్వరరావు), పార్టీ అభిమానులు పాల్గొన్నారు.