కాలువ పూడికతీత పనులు చేపట్టుట..

– తిరిగి 20న త్రాగునీటి పునరుద్ధరణ.
– 18,19  రోజులలో ప్రజలు సహకరించాలి.
– ఈ.ఈ మిషన్ భగీరథ ఏ.అరుణాకర్ రెడ్డి,గ్రిడ్ డివిజన్
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
పాలేరు జలాశయం నందు చిల్పకుంట్ల అలాగే చందుపట్ల నీటి శుద్ధి కేంద్రాలకు నీటిని అందించే కాలువ యొక్క నీటిమట్టం కనీస స్థాయికి పడిపోవడం వలన దాని పూడికతీత పనులు ఈనెల 18, 19 న జరుగుతున్నాయని ఈ.ఈ అరుణాకర్ రెడ్డి గురువారం ఒక్క ప్రకటన లో తెలిపారు.పాలేరు  చిల్పకుంట్ల పరిధిలోని 168 గ్రామాలు(నూతనకల్ 33,మద్దిరాల 27, తుంగతుర్తి 48, నాగారం 21, జాజిరెడ్డిగూడెం 39) మరియు చందుపట్ల పరిధిలోని 185 గ్రామాలు(సూర్యాపేట 30, చివ్వెంల 69, మున్సిపాలిటీ విలీన గ్రామాలు 24, ఆత్మకూరు(s) 58, మోతె 4)లకు మిషన్ భగీరథ నీటిని నిలిపి వేయడం జరిగింది. మరల 20 వ తేదీన  పునరుద్దరించబడుతుందని,   ఆయా గ్రామాల ప్రజలు సహకరించగలరని ఈ. ఈ  మిషన్ భగీరథ తెలిపారు.