
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
నిరుద్యోగ యువత మోసపూరితమైన మాటలను నమ్మి ఉద్యోగాల వేటలో యువత మోసపోవద్దు అని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో మంగళవారం వివిధ తెలుగు దినపత్రికలో వచ్చిన వార్తలకు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ స్పందిస్తూ.. కలెక్టరేట్ లో శానిటేషన్ (స్యావెంజర్) నిమిత్తం కమిటీ ద్వారా ముగ్గురు స్యావెంజర్లను టెండర్ నిర్వహించి మణికంఠ ఏజెన్సీ ద్వారా సెప్టెంబర్,2023 నెలలో తీసుకోవడం జరిగిందన్నారు. ఉద్యోగాల పేరిట మణికంఠ ఏజెన్సీ ఇతరుల వద్ద నుండి వసూలు చేసిన డబ్బులకు కలెక్టరేట్ కు సంబంధం లేదని బద్నాం చేసే ఏజెన్సీలపై కఠినంగా వ్యవహరిస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. సంబంధిత కమిటీ ద్వారా అవుట్ సోర్సింగ్ పద్దతిపై నియమించిన వివరాలను జిల్లా ఎస్ పి రాహుల్ హెగ్డే కి పంపించటం జరిగిందని, మోసపూరితంగా నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసిన మణికంఠ ఏజెన్సీ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్ పి కి సూచించారు.యువత మోసపోకుండా సంబంధిత శాఖ ల అధికారులను, ఉపాధి కల్పన కార్యాలయంలో ఉద్యోగ వివరాలు తెలుసుకోవాలని ఎక్కడ కూడా ఏజెన్సీ లకు డబ్బులు ఇచ్చి మోసపోకుడదని యువతకు సూచించారు.