కార్తీక్ రత్నం హీరోగా , సుప్యర్ద సింగ్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న చిత్రం ‘లింగోచ్చా’. ఆనంద్ బడాని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీకాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై యాదగిరి రాజు నిర్మించారు. జె నీలిమ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా, మల్లేష్ కంజర్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ఈనెల 27న విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ,’ ఈనెల 27న రిలీజ్ అవుతున్న మా సినిమా మంచి సక్సెస్ అవు తుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు. ‘సినిమా బాగా వచ్చింది. ప్రొడ్యూసర్లు ఎక్కడా కాంప్ర మైజ్ అవ్వకుండా సినిమాని చాలా గ్రాండ్‌గా నిర్మించారు. అలాగే కార్తీక్ రత్నాన్ని చాలా కొత్తగా చూడొచ్చు. తనకి మంచి ఫ్యూచర్ ఉంది’ అని దర్శకుడు ఆనంద్ చెప్పారు. హీరో కార్తీక్ రత్నం మాట్లాడుతూ, ‘ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. దర్శక, నిర్మాతలు అద్భుతంగా తెరకెక్కిం చారు. ఇప్పుడు రిలీజ్ అయిన ‘ఫిదా..’ సాంగ్ కూడా మంచి ఆదరణ పొందడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. ఉత్తేజ్, తాగుబోతు రమేష్, కునాల్ కౌషిక్ . కె, ఫిదా మౌగాల్, ప్రేమ్ సుమన్, భల్వీర్ సింగ్, పటాస్ సద్దామ్, కె. నరసింహ(మిమిక్రి ఆర్టిస్ట్), ఇస్మాయిల్ భారు, ఫిష్ వెంకట్, కళా సాగర్, శరత్ కుమార్ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం : బికాజ్ రాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎ ఆర్. సౌర్య.