థ్రిల్‌ చేసే ఊహించని మలుపులు

Unexpected twists that thrillసుడిగాలి సుధీర్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్‌ సహస్త్ర’. షాడో మీడియా ప్రొడక్షన్స్‌, రాధా ఆర్ట్స్‌ పతా కాలపై అరుణ్‌ విక్కిరాలా దర్శకత్వం లో విజేష్‌ తయాల్‌, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్‌ సరసన డాలీషా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా నిర్మాత వెంకటేశ్వర్లు కాటూరి మాట్లాడుతూ, ‘నిర్మాతలుగా ఈ సినిమా మా తొలి అడుగు. మాకు ఇదొక స్వీట్‌ మెమొరీ. డైరెక్టర్‌ అరుణ్‌, హీరో సుధీర్‌, హీరోయిన్‌ డాలీషా సపోర్ట్‌తో సినిమాను పూర్తి చేశాం. ఔట్‌ పుట్‌ సూపర్‌గా వచ్చింది. సరికొత్త సుధీర్‌ను చూస్తారని నమ్మకంగా చెబుతున్నాను. ఇందులో సుధీర్‌ పాత్రను వెండి తెరపై చూసిన ఆడియెన్స్‌ వామ్మో సుధీర్‌ ఇలాంటి పాత్రలో కూడా నటిస్తారా అనేంత వైల్డ్‌గా థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో, మాసీగా ఉంటుంది. ప్రేక్షకులు ఊహించని మలుపులతో సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌గా ఆకట్టుకోనుంది. నవంబర్‌లో సినిమాని విడుదల చేస్తున్నాం’ అని అన్నారు.