
నవతెలంగాణ – కోహెడ
నిరాధారమైన ఆరోపణలు చేయడం సరైన చర్య కాదని మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శెట్టి సుధాకర్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆదివారం ఫ్యాక్స్ ఛైర్మన్ దెవేందర్‌రావు ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమలు చేయడం లేదని ఆరోపించడం సరికాదన్నారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తుంటే ఓర్వలేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో చేయలేని పనులు ఇప్పుడు చేస్తున్నామన్నారు. 10 సంవత్సరాల కాలంలో కోహెడ ఎక్స్‌రోడ్ నుంచి మండల కేంద్రానికి రోడ్డు వేయలేదని ఎద్దేవా చేశారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చెస్తే రానున్న రోజులలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.