– మూడు ఎకరాల పంట నష్టం
నవతెలంగాణ-పినపాక
కౌలు రైతు సాగు చేసుకుంటున్న వరి పంటకు గడ్డి మందు కొట్టడంతో మూడు ఎకరాలకు పంట నష్టం జరిగింది. వివరాల్లోకి వెళితే పినపాక మండలం ఉప్పాక గ్రామపంచాయతీ ఉప్పాక గ్రామంలో కౌలు రైతు గోసంగి రవీందర్ ఐదు ఎకరాలు వరి సాగు చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు మూడు ఎకరాలకు గడ్డి మందులు కొట్టారు. దీంతో మూడు ఎకరాలు పంట పూర్తిగా ఎండిపోయాయి. సుమారు 50 వేల నష్టం జరిగిందని రైతు రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ విషయమై రైతు ఈ.బయ్యారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.