ఎంఎంటీఎస్ రైల్ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

నవతెలంగాణ -సుల్తాన్ బజార్
ఎంఎంటీఎస్ రైల్ ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన నాంపల్లి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైటెక్ సిటీ- బోరబండ మధ్య చిత్తు కాగితాలు ఏరుకునే ఓ వ్యక్తి రోడ్డు దాటే క్రమంలో  ఎంఎంటిఎస్ రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతుని వయసు 55-60. అతనికుడి చేతి పై గౌరీ అనే పచ్చబొట్టు ఉన్నట్లు తెలిపారు. అతని ఒంటిపై ఎస్ కలర్ టీ షర్ట్ . పాయింట్ నలుపు రంగు ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మాని  మార్చురీకి తరలించినట్లు తెలిపారు.