నవతెలంగాణ-బెజ్జంకి : మండల పరిధిలోని ముత్తన్నపేట గ్రామ క్రికెట్ క్రీడాకారులకు స్వేరోస్ నెట్ వర్క్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొర్ర సురేశ్ కుమార్ శుక్రవారం ఏకరూప దుస్తులను అందజేశారు.నేడు మండల కేంద్రంలోని మిని స్టేడియంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొనే ముత్తన్నపేట క్రీడాకారులకు సురేశ్ కుమార్ తన స్వంత ఖర్చులతో ఏకరూప దుస్తులను అందజేయడం హర్షనీయమని క్రీడాకారులు,గ్రామస్తులు అనందం వ్యక్తం చేశారు.