నెల్లూరు: ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ ఆఫీసు నెల్లూరులో డిజిటల్ మేళాను నిర్వహించినట్టు తెలిపింది. శుక్రవారం మద్రాస్ బస్టాండ్ సమీపంలో దీన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో బ్యాంక్ జనరల్ మేనేజర్ జ్ఞానరంజన్ సారంగి, రీజినల్ మేనేజర్ కె జోగారావు, మార్కెట్ కమిటీ ఏడీఎం అనిత, మార్కెట్ వ్యాపారస్తులు ముక్కం నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా డిజిటల్ చెల్లింపులకు వీలుగా వ్యాపారస్తులకు బ్యాంక్ అధికారులు క్యూఆర్ కోడ్స్‌ను పంపిణీ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థలో బ్యాంక్‌లు కీలక పాత్ర పోశిస్తున్నాయని సారంగి పేర్కొన్నారు. చిరు వ్యాపారస్తులను డిజిటలైజేషన్‌లో వారిని భాగస్తులుగా చేయడం తమ బ్యాంక్ లక్ష్యమన్నారు. అనంతరం బాలాజీనగర్‌లోని అంజనా రూరల్ డెవలప్‌మెంట్ వాలంటరీ ఆర్గనైజేషన్‌కు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా వాటర్ ప్యూరీఫైయర్‌ను, నిత్యావసర సరుకులు అందజేశారు.