సూక్ష్మ రుణాల కోసం 200 సెంటర్లు తెరిచిన యూనియన్‌ బ్యాంక్‌

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సులభంగా సూక్ష్మ రుణాలను జారీ చేయడానికి వీలుగా దేశ వ్యాప్తంగా 200 మైక్రో ప్రాసెసింగ్‌ సెంటర్లు (ఎంపీసీఎస్‌) తెరిచింది. మంగళవారం వీటిని ఆ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ మనిమెఖలయి వర్చ్యూవల్‌గా ప్రారంభించారు. పీఎం స్వనిధీ, పిఎంఎస్‌బివై, పిఎంజెజెబివై, ఎపివై, ఎన్‌యుఎల్‌ఎం తదితర ప్రభుత్వ పథకాల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆ బ్యాంక్‌ తెలిపింది.