
బ్యాంక్ లావాదేవీల్లో ఆన్లైన్,డిజిటల్ సేవలు ప్రవేశం తర్వాత వ్యాపారు చిల్లర కొరతను ఎదుర్కొంటున్నారని,దీన్ని అధిగమించేందుకే నాణేల మేళా నిర్వహిస్తున్నామని యూనియన్ బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్ తెలిపారు. ఖాతాదారులకు అందిస్తున్న డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు చిల్లర నాణేలు వాడాలని ఆయన ఖాతాదారులకు సూచించారు. మార్కెట్లో చిల్లర నాణాల కొరత లేకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నామని,ఇందుకు రూ.1,2,5,10 నాణాలను అందజేయడానికి “కాయిన్స్ మేళా” నిర్వహిస్తున్నట్లు చెప్పారు.స్థానిక బ్రాంచ్ కార్యాలయంలో శుక్రవారం బ్యాంక్ ఖాతాదారులు అయిన వ్యాపారులకు చిల్లర నాణాలను అందించారు.చిల్లర కోసం వ్యాపారులు ఎదుర్కోంటున్న సమస్యలను గుర్తించి నాణాలను అందిస్తున్నట్లు చెప్పారు. రూ.10 నాణెం చెల్లు బాటు పై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని,యదేచ్చగా మార్కెట్లో రూ.10 నాణేలు చెలామణి అవుతాయని వివరించారు.కార్యక్రమంలో తిరుమలకుంట బ్రాంచ్ మేనేజర్ మురళీకృష్ణ,బ్యాంక్ సిబ్బంది శ్రీధర్, నాగబాబు, మాధవి, హారిక, మనోహర్, జరీనా, పలువురు వ్యాపారులు పాల్గొన్నారు.