అంచనాలకు ఆమడ దూరంలో కేంద్ర బడ్జెట్‌

– అపోలో గ్రూప్‌ హాస్పిటల్స్‌ అధ్యక్షుడు వెల్లడి
నవతెలంగాణ – హైదరాబాద్‌
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్‌ బుధవారం ప్రవేశపెట్డిన మధ్యంతర బడ్జెట్‌ అంచనాలను అందు కోలేకపోయిందని అపోలో గ్రూప్‌ హాస్పి టల్స్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కె హరి ప్రసాద్‌ తెలిపారు. ఏది ఏమైనప్పటికీ, దేశం స్థిరమైన వృద్థికి సిద్ధంగా ఉందని స్పష్టమైందన్నారు. ఆరోగ్య రంగంలో బాలికలకు గర్భాశయ టీకాలు వేయడం స్వాగతించదగిన విషయమన్నారు. గర్భాశయ క్యాన్సర్‌ అనేది మహిళల్లో ముఖ్యంగా దిగువ మధ్య తరగతి కుటుం బాలలో అత్యంత సాధారణ రకం క్యాన్సర్‌గా మారిం దన్నారు. వ్యాక్సిన్‌ దీనిని నివారిస్తుందన్నారు. ఇది ఆరోగ్య సంరక్షణ రంగంలోనే కాకుండా సామాజిక, ఆర్థిక రంగంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందన్నారు. కాగా.. బడ్జెట్‌ ఎందుకు అంచనాలను అందుకో లేకపోయిందో ఆయన స్పష్టం చేయలేదు.