
నవతెలంగాణ – తొగుట
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నూతనం గా ఒక్క వెసులుబాటు కల్పించలేదని, వేతన జీవులను పూర్తిగా నిరాశపర్చిందని పీఆర్టీయూ మండల అధ్యక్షులు పుల్ల గూర్ల రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి లచ్చుగారి కనుకరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం వారు పత్రికా ప్రకటన ద్వారా తెలిపిన ప్రకారం కొత్త పన్నుల విధానంలో 80సి, 80డి, ఇంటి అద్దె, విద్య, గృహ రుణాలపై వడ్డీ తదితర మినహాయింపులు వర్తింపుజేయాలని డిమాండ్ చేశారు. మూడేళ్ళుగా సంఘాలు కోరుతున్నా పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు.
బడ్జెట్ ప్రతిపాదనలకు సవరణలు చేసి, పన్నుల భారం తగ్గించి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కాస్తయినా ఉపశమనం కలిగించాలని కోరారు. ప్రత్యక్ష పన్ను మినహాయింపు పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని అన్నారు.