గద్దర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగజారుడు వ్యాఖ్యలు సరికావు..

– బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ 

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ప్రజా సాంస్కృతిక యుద్ధనౌక గద్దర్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన దిగజారుడు వ్యాఖ్యలను బహుజన లెఫ్ట్ పార్టీ (బహుజన కమ్యూనిస్టు) బిఎల్పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ నల్లకుంట లోగల బహూజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి విలేకరులకు విడుదల చేసిన ఒక ప్రకటనలో దండి వెంకట్ మాట్లాడుతూ.. రాజ్యాంగ బద్ద కేంద్ర మంత్రిగా విధులు నిర్వహిస్తున్న బండి సంజయ్ గద్దర్ పై చేసిన దిగజారుడు రాజకీయ వాఖ్యలు చేసారని ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రజా యుద్ధ నౌక గద్దర్ అజాతశత్రువు అని ఆయన అన్నారు.బిజెపి కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగజారుడు రాజకీయాలకు తెలంగాణ ప్రజలు సరైన సమాధానం చెపుతారని దండి వెంకట్ తెలిపారు.