నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదమే కేంద్ర మంత్రి పదవి…

– ఘన స్వాగత కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి..

– కేంద్ర మంత్రికి బీజేపీ శ్రేణుల ఘన స్వాగతం.. 

– బీజేపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపిన బండి..
నవతెలంగాణ – బెజ్జంకి 
పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మేజారిటీతో ఎన్నికవ్వడానికి కృషి చేసిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదమే కేంద్ర మంత్రి పదవి వరించిందని.. స్వాగతం పలికడానికి వచ్చిన నియోజకవర్గ బీజేపీ శ్రేణుల అభిమానం మరువలేనిదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అనందం వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించి మొట్టమొదట సారిగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా మంగళవారం మండల పరిధిలోని రేగులపల్లి స్జేజ్ వద్ద బీజేపీ జిల్లా, అయా మండలాధ్యక్షులు స్వాగత ఏర్పాట్లు చేశారు. బీజేపీ కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి, మండలాధ్యక్షుడు కొలిపాక రాజు, ప్రధాన కార్యర్శి బోయినిపల్లి అనిల్ రావు, లెంకల కిషన్ రెడ్డి, తూముల రమేశ్ యాదవ్, ముస్కే మహేందర్, ఫాన వేణు, మహిళ నాయకులు బామండ్ల జ్యోతి బండిపెల్లి కేంద్ర మంత్రి బండి సంజయ్ కు గజమాల వేసి.. పుష్పగుచ్చం అందించి.. శాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు.మండలంలోని అయా గ్రామాల బీజేపీ శ్రేణులు హజరయ్యారు.
కార్యక్తల కోరిక మేరకు…
స్వాగత కార్యక్రమం ముగిసిన అనంతరం కరీంనగర్ జిల్లా కేంద్రానికి వాహనంలో బయదేరి వేళ్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేకంగా స్వాగతం పలుకుతామని బీజేపీ శ్రేణుల విజ్ఞప్తి మేరకు వాహనం దిగి వచ్చి కాసేపు బీజేపీ శ్రేణులతో గడిపారు.