– రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం
నవతెలంగాణ – తాడ్వాయి
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, బిజెపి ప్రభుత్వం వెంటనే కేంద్రం మంత్రి రణ్విత్ సింగును వెంటనే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నాయకులు బొల్లు రమేష్ కుమార్ ముదిరాజ్ హెచ్చరించారు. రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బొల్లు రమేష్ కుమార్ ముదిరాజ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాలుకకు వస్తే లక్ష రూపాయల రివార్డు ఇస్తానని ప్రకటించడం ఇంద్ర గాంధీ రాజీవ్ గాంధీ లకు పట్టిన గతే రాహుల్ గాంధీకి పడుతుందని బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే బిజెపి నాయకులు రాహుల్ గాంధీని చంపే కుట్ర చేస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం పరిచారు. రాహుల్ గాంధీ పై అనిత వ్యాఖ్యలను తీవ్రమైనవిగా పరిగణించాలని పూరితమైన వ్యాఖ్యలు చేసిన బిజెపి నాయకుడు తన్విదర్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని బొల్లు రమేష్ కుమార్ డిమాండ్ చేశారు.