
దేశ పార్లమెంటులో ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడంపై కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపే మల్లేష్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బలహీన ప్రధాని ఏపి, బీహార్ సీఎం లకు భయపడి అధిక నిధులు మంజూరు చేశారన్నారు. బీజేపీ పక్షపాత వైఖరిని యువత, ప్రజలు ఖండించాలని కోరారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలైన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ములుగు జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, తెలంగాణ రాష్ట్రానికి అధిక నిధులు రాబట్టడంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తోపాటు మిగతా బీజేపీ పార్లమెంటు సభ్యులు వెంటనే పూర్తిగా నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకుల, తెలంగాణ వ్యతిరేఖ వైఖరిని రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామిక వాదులు సీపీఐ అనుభంద సంఘాలు అర్థం చేసుకోని ముక్తా కంఠంతో ఎక్కడికక్కడే ఖండించి తమ నిరసన తెలిపాలని కోరారు.