యూనిక్‌ పాయింట్‌..

యూనిక్‌ పాయింట్‌..గంగా ఎంటర్టైన్మంట్స్‌ బ్యానర్‌ మీద అప్సర్‌ దర్శకత్వంలో అశ్విన్‌ బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘శివం భజే’. ఈ చిత్రం నేడు (గురువారం) రిలీజ్‌ కానుంది.
సినిమా విడుదల సందర్భంగా హీరో అశ్విన్‌ బాబు మీడియాతో మాట్లాడుతూ, ”హిడింబ’ తరువాత చాలా కథలు విన్నాను. ఏదో కొత్తగా ట్రై చేయాలని, యూనిక్‌ పాయింట్‌తో రావాలని అనుకున్నాను. ఆ టైంలోనే ఈ కథను విన్నాను. నాకు చాలా బాగా నచ్చింది. ఆడియెన్స్‌కి కూడా ఈ యూనిక్‌ పాయింట్‌ నచ్చుతుందని భావిస్తున్నాను. ‘రాజు గారి గది, హిడింబలా’ ఇందులోనూ కొత్త పాయింట్‌ ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు ఇందులో డివైన్‌ పాయింట్‌ కూడా ఉంది. ఈ చిత్రంలో పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాను. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు.. అంతా విధి.. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే టైపులో ఉండే పాత్ర. అలాంటి పాత్ర చుట్టూ రాసుకున్న కథ నాకు చాలా నచ్చింది. ముస్లిం వ్యక్తి అయినా కూడా అప్సర్‌ ఈ కథను రాసిన విధానం నాకు చాలా నచ్చింది. వికాస్‌ బడిస మ్యూజిక్‌, అప్సర్‌ రాసిన కథ, శివేంద్ర విజువల్స్‌ ఈ సినిమాకు ప్రధాన బలం. మా నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించారు’ అని అన్నారు.