ఐక్యభారతం!

United India!పూర్ణస్వరాజ్యం కరిమబ్బు వీడిన
నిండు చంద్రుళ్ళా ప్రభవించిన దినం!
తరతరాల బానిసత్వం తరలిపోయిన
బతుకులకు తుదిమెరుగులు దిద్దిన
నిజమైన స్వాతంత్రదినం!
స్వతంత్ర శక్తికి గణతంత్రయుక్తికి
జతకలిసిన సర్వసత్తాక చైతన్య దినం!
సామ్యవాదం లౌకికధర్మం స్వర్ణఘంటంతో
నవభారతం లిఖించిన దినం!
రవి అస్తమించని బ్రిటీషుని సాగనంపి
కోటి సూర్యుళ్ళ వెలుగులతో
కొత్త ఉదయానికి తెర తీసిన
భారత రాజ్యాంగ ఆరంభోత్సవం!
ఎందరో త్యాగధనుల మేధోతంత్రమే
ఈనాటి గణతంత్రం
సామాన్యుణ్ణి మాన్యుణ్ణి చేసి
అందలమెక్కించే అవకాశాలు
అడుగడుగునా పుష్పించే పూలవనమై
దేశం వికసించాలని
కలలు కన్న మహనీయుల ఆశయాలకు
ఊపిర్లు పోసిన ఘనతంత్రం!
కుల మత ప్రాంత చీకట్ల తోలి
నవోదయంలో జవాన్‌ కిసాన్‌ లను
సూర్యచంద్రుళ్ళా వెలిగించే నవతంత్రం!

– భీమవరపు పురుషోత్తమ్‌, 9949800253