యూనివర్సల్‌ కాన్సెప్ట్‌

యూనివర్సల్‌ కాన్సెప్ట్‌ఆహా ఓటీటీ ఒరిజినల్స్‌గా స్ట్రీమింగ్‌కు ‘వేరే లెవెల్‌ ఆఫీస్‌’ వెబ్‌ సిరీస్‌ రానుంది. వరుణ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై వరుణ్‌ చౌదరి గోగినేని నిర్మిస్తున్నారు. ఇ.సత్తిబాబు దర్శకుడు. ఆర్‌ జే కాజల్‌, అఖిల్‌ సార్థక్‌, శుభశ్రీ, మిర్చి కిరణ్‌, రీతు చౌదరి, స్వాతి చౌదరి, వసంతిక, మహేశ్‌ విట్టా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్‌ 12వ తేదీ నుంచి ఈ సిరీస్‌ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ సిరీస్‌ ట్రైలర్‌ను రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈవెంట్‌లో రిలీజ్‌ చేశారు. డైరెక్టర్‌ ఇ.సత్తిబాబు మాట్లాడుతూ, ‘తమిళంలో ‘వేరే మాదిరి ఆఫీస్‌’ వెబ్‌ సిరీస్‌ పెద్ద సక్సెస్‌ అయ్యింది. దాన్ని తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఆహా టీమ్‌ నన్ను అప్రోచ్‌ అయ్యారు. తెలుగు కోసం ఒరిజినల్‌ నుంచి 50% మార్పు చేశాం. మన దగ్గర ఉండే కార్పొరేట్‌ ఫ్యామిలీస్‌ అందరికీ ఈ సిరీస్‌ బాగా కనెక్ట్‌ అవుతుంది. పేరుకు తగినట్లే ఈ సిరీస్‌ వేరే లెవెల్‌లో ఉంటుంది’ అని తెలిపారు. ఆహా కంటెంట్‌ హెడ్‌ వాసు మాట్లాడుతూ, ‘ఇది యూనివర్సల్‌ కాన్సెప్ట్‌. అందరికీ నచ్చుతుంది. తమిళంలో సక్సెస్‌ అయిన ప్రాజెక్ట్‌ను మన తెలుగు ఆడియెన్స్‌కు మరింత రీచ్‌ అయ్యేలా తీసుకొస్తున్నాం’ అని అన్నారు.