యూనివర్సిటీ లో ఇంటర్ కళాశాల అట్లెటిక్స్ సెలక్షన్స్-2023-24 ప్రారంభం…

నవతెలంగాణ -డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లో ఇంటర్ కళాశాల అట్లెటిక్స్ సెలక్షన్స్-2023-24 ను వర్సిటీ క్రీడా మైదానంలో క్రీడా విభాగ డైరెక్టర్ డాక్టర్ బాలకిషన్ గురువారం ప్రారంభించారు.సెలక్షన్స్  కొరకు ఉమ్మడి నిజాంబాద్ జిల్లాల నుండి వివిధ కళాశాలలోని ( డిగ్రీ మరియు పీజీ ) క్రీడాకారులు పాల్గొన్నారు.ఈ సెలక్షన్లో మంచి క్రీడా నైపుణ్యం కలిగిన క్రీడాకారులను ఎంపిక చేసి సౌత్ ఇంటర్ యూనివర్సిటీ అట్లెటిక్స్  పోటీలకు తెలంగాణ వర్సిటీ తరపున పాల్గొంటారని తెలిపారు.ఈ సౌత్ జోన్ ఇంటర్ వర్సిటీ అట్లాంటిక్ ( మెన్) టోర్నమెంట్ ఈనెల 29 నుండి 2024 జనవరి 1, వరకు తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ చెన్నైలో  జరుగుతుందని స్పోర్ట్స్ డైరెక్టర్ తెలిపారు.ఈ సెలక్షన్స్ లో తొమ్మిది కళాశాలల క్రీడాకారులు దాదాపు 100 మందికి  పైగా  పాల్గొన్నారు తెలిపారు.ఈ సెలక్షన్ల లో వర్సిటీ క్రీడా విభాగం సహాయ ఆచార్యులు ( కాంట్రాక్ట్) డాక్టర్ బి.ఆర్ నేత వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్స్, అనిల్ కుమార్,రామ్ కిషన్, సౌమ్య, మరియు క్రీడా విభానికి చెందిన జూనియర్ అసిస్టెంట్ నరేష్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.