– 15 రోజులు ఆలస్యంగా వెలుగులోకి..
– గోప్యంగా ఉంచాలని వార్డెన్ గంగాకీషన్ విద్యార్థులకు హుకుం..?
– ఘటన పై విద్యార్ధి సంఘల అగ్రహం
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలోని న్యూ బాయ్స్ హస్టల్ గదిలో ఉంటున్న ఓ విద్యార్థి తనకు పరిచయం ఉన్న ఓ బాలికకు వసతి కల్పించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సోమవారం కలకలం రేపుతోంది. యూనివర్సిటీలో బోటనీ రెండో సంవత్సరం అభ్యసిస్తూ ఓ విద్యార్థి న్యూ బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాడు. అయితే గతంలో డిగ్రీ చదివే సమయంలో పరిచయం ఉన్న ఓ స్నేహితురాలు నిజామాబాద్కు రావడంతో ఆమెను నేరుగా తాను ఉంటున్న ఉంటున్న యూనివర్సిటీ లోని బాయ్స్ హాస్టల్కు జూన్ 25 న రాత్రికి 8.30 గంటల సమయంలో తెచ్చి ఉంచినట్లు సమాచారం. సదరు విద్యార్ధినిని తెల్లవారు జామున 5.30 గంటల సమయంలొ బయటకు పంపిస్తున్న సయమంలో బాయ్స్ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు గమనించి హాస్టల్ వార్డెన్, చీఫ్ వార్డెన్కు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి ని విచారణ జరిపించడంతో అసలు విషయం తెలిసింది. బాయ్స్ హాస్టల్లో ఉంటున్న ఓ విద్యార్థి గత 15 రోజుల కిందట ఓ బాలికను గదికి తెచ్చి వసతి కల్పించినట్లు విచారణలో తేలడంతో సదరు బాలుడిని యూనివర్సిటీ నుంచి, హస్టల్ నుంచి సస్పెండ్ చేసినట్లు రిజిస్ట్రార్ తెలిపారు.
బాయ్స్ హస్టల్కు బాలికలను తీసుకురావడం నేరం అవుతుందన్నారు. బాలికను బాయ్స్ హస్టల్కు తీసుకువచ్చినట్లు సెక్యూరిటీ నిర్లక్ష్యంగా వ్యవహరించా డంతోనే ఈ సంఘటన చోటుచేసుకుని ఉంటుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అలాగే చాలా సంవత్సరాల కిందట యూనివర్సిటీకి సంబంధం లేని ఓ యువకుడు వర్సిటీ గర్ల్స్ హాస్టల్లోకి ప్రవేశించాడని అప్పట్లో తీవ్ర దుమారం నెలకొందనే విమర్శలు అనేకంగా ఉన్నాయి. బాలికలను యూనివర్సిటీ లోని బాయ్స్ హాస్టల్ కు తీసుకురావడం నిబంధనలకు విరుద్ధం, నేరం అవుతుందన్నారు. బాలికను బాయ్స్ హాస్టల్కు తీసుకువచ్చినట్లు అని సమయంలో సెక్యూరిటీ గార్డులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విషయం పై విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ విషయం బయటికి పొక్కకుండా గోప్యంగా ఉంచాలని వార్డెన్ గంగాకీషన్ విద్యార్థులకు హుకుం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచరం. ఘటన విషయం మీడియాకు చెప్పొద్దని విద్యార్థులను బెదిరించినట్లు ఆనోటా ఈనోటా తెలిసింది. ఎలాంటి అనుభవం లేని వారికి వార్డెన్ పోస్టు ఇవ్వడాన్ని సైతం విద్యార్ధి సంఘాలు విమర్శిస్తు న్నాయి. తక్షణమే నిర్లక్ష్యం వహించిన వారిని విధుల నుంచి తప్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. చాలా ఏండ్ల కిందట యూనివర్సిటీకి సంబంధంలేని ఓ వ్యక్తి బాలికల హాస్టల్లోకి ప్రవేశించిన ఘటన అప్పట్లో కలకలం రేగింది.