రొటీన్‌కి భిన్నంగా గేమ్‌ ఆన్‌

గీత్‌ ఆనంద్‌, నేహా సోలంకి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. కస్తూరి క్రియేషన్స్‌ ప్రొడక్షన్‌, గోల్డెన్‌ వింగ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై దయానంద్‌ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ‘రిచ్చో రిచ్‌..’ అంటూ సాగే ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ను చిత్ర బందం రిలీజ్‌ చేసింది. ఈ పాటకు అసుర ఇచ్చిన లిరిక్స్‌ చాలా క్యాచీగా ఉన్నాయి. వైవిధ్యమైన వాయిస్‌తో అసుర, రిక్కీ ఆలపించిన విధానం కొత్తగా ఉంది.
ఈ సందర్భంగా నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ, ‘గతంలో మేం విడుదల చేసిన ‘గేమ్‌ ఆన్‌’ టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌, ఫస్ట్‌ లుక్‌ లాంచ్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. రీసెంట్‌గా హైదరాబాద్‌ ఫేమస్‌ నవాబ్‌ గ్యాంగ్‌ బ్యాండ్‌ ద్వారా మ్యూజిక్‌ను ఫస్ట్‌ టైం రిలీజ్‌ చేశాం. ప్రోమోకు కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. టీజర్‌ను చూసిన చాలా మంది ఫ్రెండ్స్‌, డిస్ట్రిబ్యూటర్స్‌ మమ్మల్ని ఈ సినిమా గురించి మరింత ఆసక్తిగా అడిగారు. దీంతో ఈ సినిమాపై మాకు చాలా మంచి నమ్మకం వచ్చింది. ఈ సినిమాకు ఇద్దరు అన్న దమ్ములుగా వర్క్‌ చేస్తున్నారు. ఒకరు హీరోగా, ఒకరు డైరెక్టర్‌గా ఈ సినిమాకి చేయటం విశేషం. అరవింద్‌ విశ్వనాథన్‌ అద్భుతంగా విజువల్స్‌ ఇచ్చాడు. ప్రతి ఫ్రేమ్‌ మిమ్మల్ని ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్తుంది. ఇంటెన్స్‌ క్యారెక్టర్స్‌ మధ్య జరిగే ఎమోషనల్‌ జర్నీ ఇది. హీరో ఒక లూజర్‌గా తన లైఫ్‌లో మిగిలిపోతున్న టైమ్‌లో తన లైఫ్‌లో ఒక గేమ్‌ స్టార్ట్‌ అవుతుంది. తనని ఆ గేమ్‌ ఏ లెవల్‌కు తీసుకెళ్తుందనేదే ఈ కథ. లేటెస్ట్‌గా మేం విడుదల చేసిన సాంగ్‌కు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. త్వరలో ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ కూడా చేయబోతున్నాం. అలాగే ఈ సినిమాకు చేసే ప్రతి ప్రమోషన్‌ కూడా వినూత్నమైన రీతిలో ఉంటుంది’ అని తెలిపారు. ఇది రొటీన్‌ సినిమాలకు భిన్నంగా ఉండే కథ. తెలుగులో ఇప్పుడు డిఫరెంట్‌ సినిమాలు రావడమే కాదు.. సక్సెస్‌ కూడా అవుతున్నాయి. ఓ మార్క్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ఆ కోవలోనే ఈ సినిమా ఉంటుంది. చాలా ట్విస్టులు, టర్నులుంటాయి. ఈ సినిమాలో యాక్షన్‌, రొమాన్స్‌. ఎమోషన్స్‌… ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
– డైరెక్టర్‌ దయానంద్‌