
ఉద్యమ గాయకుడు, ధూమ్ ధాం కళాకారుడు నూనె రాజేశంను “ఉద్యమ గానకోకిల” పురస్కారంకు ఎంపిక చేసినట్లు ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూమెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేకల చంద్రశేఖర్ యాదవ్ ప్రధాన కార్యదర్శి ముక్కెర సంపత్ కుమార్ లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యమాలకు, పోరాటాలకు ఆయువు పట్టయిన ఉత్తర తెలంగాణ ప్రాంతంలో సహజ వనరులు, నిధులు, ఇసుక, క్వారీ, బొగ్గు, నీళ్లు సమృద్ధిగా ఉన్నాయని అన్నారు. ఈ ప్రాంత ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ, సంపదను ఇతర ప్రాంతాలకు తరలించడం అన్యాయమని అన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంత వనరుల పరిరక్షణ కొరకే తమ సంస్థ ఏర్పాటు చేశామని అన్నారు. ఈనెల 12న, కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆవిర్భావ సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ నాయకులకు సన్మానం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉత్తమ కవి గాయకుడు, నాయకుడు, నూనె రాజేశం ఎంతో పేరు గడించాడని, అందుకే అతనికి ఈ పురస్కారానికి ఎంపిక చేశామని తెలిపారు. తనను ఈ పురస్కారానికి ఎంపిక చేసిన మేకల చంద్రశేఖర్ యాదవ్ కి, ప్రధాన కార్యదర్శి ముక్కెర సంపత్ కుమార్ లకు నూనె రాజేశం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.