పంచాయతీ కార్మికులకు అందని జీతాలు

– ఆర్థిక ఇబ్బందులతో  కార్మికుల కష్టాలు
నవతెలంగాణ – పెద్దకోడప్ గల్
మండలంలోని  ఆయా గ్రామా పంచాయతీలలో పని చేసే62 మంది కార్మికులకు గత మూడు నెలల నుండి ప్రభుత్వం నుండి జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని సతమతం  అవుతున్నారు.  పంచాయతీలో పారిశుధ్య, ఇతర విభాగాల కార్మికులకు మూడు నెలలుగా జీతాలు రాక  చాలీచాలని వేతనాలతో బతుకీడుస్తున్న కార్మికులకు నెలనెలా జీతం రాక అప్పులపాలవుతున్నారు. కాంట్రాక్ట్‌ కార్మికులకు నెలకు రూ.8,500, క్యాజువల్‌ లేబర్‌కు రోజుకు రూ.300 చొప్పున ఇస్తున్న వాటిని కూడా నెలనెలా చెల్లించకపోవడంతో కార్మికులు ఆర్థిక ఇబ్ బందులతో, తినీతినక విధులకు హాజరవుతున్నారు. సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న  పట్టించుకోవడం లేదని కార్మికులు, సంఘాల నాయకులు వాపోతున్నారు.  గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణలో ప్రధానపాత్ర పోషించే కార్మికుల బతుకులు దుర్భరంగా మారిందని చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్నాట్లు కార్మికులకు నెలనెలా ఇవ్వాల్సిన వేతనాలను నెలల తరబడి ఇవ్వకపోవడంతో అప్పు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారు.సమయపాలన లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్మికులు ఏదో ఒక పని గ్రామ పంచాయతీ పరిధిలో చేస్తూనే ఉంటారు. ఎప్పటికైనా ప్రభుత్వం పర్మినెంట్‌ చేస్తదానే ఆశతో కార్మికులు పని చేస్తున్నారు. పారిశుధ్య, ఎలక్ట్రీషియన్‌, వాటర్‌మెన్‌గా, క్లరికల్‌ విభాగాల్లో ఏళ్లుగా చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీస వేతనం చెల్లించాలని, నెలనెలా సరిగ్గా జీతాలు ఇచ్చేవిధంగా కృషి చేయాలని కార్మికులు కోరుతున్నారు.