నవతెలంగాణ-కోహెడ
మానవాళి మనుగడకు విద్య, వైద్యం ప్రాముఖ్యమైనదని గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు గవ్వ వంశీధర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కెల్విన్ హాస్పిటల్ సహాకారంతో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిభిరాన్ని ట్రస్ట్ అధ్యక్షుడు గవ్వ కిషన్‌రెడ్డి, హాస్పిటల్ ఛైర్మన్ చింతం సురేష్‌కుమార్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ శిభిరంలో రక్తపరీక్ష, గుండె పరీక్ష, ఈసీజీ, టుడికో, బీపీ షుగర్ లాంటి పరీక్షలను నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. పేద ప్రజలకు ఇలాంటి శిభిరాలు ఎంతగానో తోడ్పాడుతాయని పలువురు గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలలో సామాజిక కార్యకర్త వలుస సుభాష్, డాక్టర్‌లు గౌతమ్ తిరుకోవెల, వేణు, సప్తఋషి, ప్రశాంత్ నాయక్, హాస్పిటల్ సిబ్బంది, కోనవేణి బాలకిషన్, నిషాని సంపత్, పూసల రాజశేఖర్, ములుగురి హరికృష్ణ, గడపే సుజిత్, శ్రావణ్, దర్గారెడ్డి, గవ్వ రాజిరెడ్డి, మూల రవీందర్‌రెడ్డి, అవినాష్, అరవింద్, జంపయ్య, సిద్దు, గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.