ఎదురులేని భారత్‌

Unrivaled India– బ్రెజిల్‌పై 64-34తో గెలుపు
– ఖోఖో ప్రపంచకప్‌
న్యూఢిల్లీ: ఖోఖో ప్రపంచకప్‌లో భారత పురుషుల జట్టు వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన గ్రూప్‌-ఎ రెండో లీగ్‌ మ్యాచ్‌లో భారతజట్టు 64-34పాయింట్ల తేడాతో బ్రెజిల్‌ను చిత్తుచేసింది. ఈ గెలుపుతో భారత జట్టు 4పాయింట్లతో టాప్‌లో నిలిచింది. ఇక మహిళల జట్టు తన గ్రూప్‌-ఎలో తొలి లీగ్‌ మ్యచ్‌లో 175-18పాయింట్ల తేడాతో కొరియాను చిత్తుచేసింది. దీంతో 157పాయింట్ల వ్యత్యాసంతో టాప్‌లో నిలిచింది. బుధవారం జరిగే మూడో లీగ్‌ మ్యాచ్‌లో భారత జట్టు పెరూతో తలపడనుంది.