పెనకలో దోపిన పాత కాయితం ఒకటి
కుంభ నిద్ర నుండి తెలివికున్నదేమో
పరాకులో నేల మీద పడి చిట్లిపోయింది
విరిగిపోయిన అక్షరాలు కొన్ని
పాలిపోయిన అక్షరాలు ఇంకొన్ని
కొన ఊపిరితో ఉన్నవి మరికొన్ని
అన్నిటికీ అన్ని కొట్టుమిట్టాడుతున్నవే
రూటం మాత్రం పదిలంగానే ఉంది
చానడు మాటకలుపులతో ఉన్న
ముందు జమనా ఉత్తరం ముక్క
బంధువులందరినీ పేరుపేరునా పలకరిస్తూ
ఆత్మీయత, అనుబంధాల కుశల ప్రశ్నలతో
ప్రేమానురాగాలకు రుజువుగా
ఎలాగోలా మిగిలిపోయిన కులాసాల ముక్క
చివరిలో.. మీ యోగక్షేమాల కొరకు
వేయి కళ్ళతో ఎదురుచూస్తుంటాం!
చదువుతున్నప్పుడు మైమరచిపోయి
సెల్‌ఫోన్‌తో మమతానురాగాలు తరిగి
బంధాల మధ్య కనిపించని కుశల ప్రశ్నలతో
పానుగొట్టుకున్నదేదో కళ్ళంట పూసింది
ఏకరవు పెట్టి పదే పదే మోగుతున్న
సెల్‌ఫోన్‌తో తెములుకొని తీరా చూస్తే
రానొచ్చిందొక్కటీ ఉత్తరం లాంటిది లేదు
అన్నీ, పైసల పర్రాకుల పరుగూ నడకలే!
– వినోద్ కుత్తుం, 9634314502