– ఏడాదిలోనే రూ.13,961.54 కోట్లు రద్దు
– గత ఐదేండ్లలో మరుగునపడ్డ రూ.71,686 కోట్లు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
2022-23లో రూ.13,961.54 కోట్ల ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేయలేదని, దీంతో ఆ మొత్తం నిధులు రద్దు అయ్యాయని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథ్వాలే తెలిపారు. రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ వి.శివదాసన అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బుధవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గత ఐదేండ్లలో ఎస్సీ సబ్‌ప్లాన్‌కు సంబంధించిన వేల కోట్ల నిధులు ఖర్చు చేయకపోవడంతో రద్దవుతున్నాయని పేర్కొన్నారు. ఐదేండ్లలో మొత్తం రూ.71,686.43 కోట్లు ఎస్‌సీ సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు కాకుండా మరుగునపడ్డాయి.
ఏడాది ఖర్చు కాని, రద్దయిన ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు
2018-19 రూ.9,818.24 కోట్లు
2019-20 రూ.11,042.26 కోట్లు
2020-21 రూ.19,922.35 కోట్లు
2021-22 రూ.16,942.04 కోట్లు
2022-23 రూ.13,961.54 కోట్లు
మొత్తం రూ.71,686.43 కోట్లు