
ప్రజాపాలన దరఖాస్తుదారుల నిరీక్షణ
నవతెలంగాణ – భీంగల్
విధుల్లో నిర్లక్ష్యం చేయరాదని ఓ పక్క జిల్లా స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇవేమీ పట్టనట్టు మండల స్థాయి అధికారులు ప్రవర్తిస్తున్నారు. ఇందుకు ఉదాహరణ మండల పరిషత్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. ప్రభుత్వ సమయం 10 గంటల 30 నిమిషాల వరకు ఏ ఒక్క సిబ్బంది సమయానికి హాజరు కాలేకపోతున్నారు. బుధవారం సమయం10:40 దాటినా కార్యాలయంలో ఏ ఒక్కరు హాజరు కాకుండా కాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ప్రస్తుతం ప్రజాపాలన దరఖాస్తులకు ఎంపీడీఓ కార్యాలయంలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడంతో దరఖాస్తుదారులు ఇక్కడ సిబ్బంది కోసం నిరీక్షిస్తున్నారు. వృద్ధులైతే నిరీక్షించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.