నాగిరెడ్డిపేటలో బిఎంఎస్ యూనియన్ జెండా ఆవిష్కరణ..

నవతెలంగాణ నాగిరెడ్డిపేట్..
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం  బిఎంఎస్ యూనియన్ 70 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫ్రెండ్స్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఎంఎస్ యూనియన్ 70వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించినట్టు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆటో యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శివకుమార్,  యూనియన్ ప్రధాన కార్యదర్శి సాయ గౌడ్ తో పాటు ఆటో డ్రైవర్లు జయరాం, బషీర్, ఖదీర్, మహేష్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.