
మండల కేంద్రంలో సోమవారం ఆల్ ఇండియా యూనిటీ మహాసభల గోడ ప్రతులను సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి. ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో ప్రజాతంత్ర, సోషలిస్ట్ విప్లవమే సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ లక్ష్యమన్నారు. పిడివాదంతో కాకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనిస్ట్ విప్లవ కారులు కూడా తమ పంథా, కార్యక్రమంలను మార్చుకొనవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పీసీసీ సీపీఐ (ఎంఎల్), సీపీఐ ( ఎంఎల్ ) ప్రజాపంథా, సీపీఐ (ఎంఎల్) ఇన్సియేటివ్ రివల్యూషనరి పార్టీలు విప్లవోధ్యమమే ఏకైక ఎజెండాగా ఐక్యం అవుతున్నాయన్నారు. దేశవ్యాపితంగా ఓకే అతిపెద్ద విప్లవ పార్టీగా మారానున్నాయాన్నారు. ఇందులో భాగంగానే మార్చ్ 3,4,5 తేదీల్లో ఖమ్మంలో 50వేల మందితో భారీ ర్యాలీ, బహిరంగసభను నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఎర్రసైనికులతో “రెడ్ కవాతు” ఖమ్మంలో నిర్వహించభోతున్నట్టు అయన తెలియజేశారు.విప్లవ పార్టీలు విడిపోతున్న సమయంలో మూడు విప్లవ శక్తులు ఐక్యత వైపు అడుగులు వేయడం పురోగమనంలో గొప్ప మైలురాయి అని పేర్కొన్నారు.దేశ ప్రధాని మోడీ నియంతృత్వంతో పాలనా సాగిస్తున్నాడని, కేవలం రాముడు పేరుతో, రాముడి జపంతో మాత్రమే పాలనా సాగిస్తూ దేశాన్ని వెనక్కి తీసుకెళ్తు ఆదాని, అంబానీలకు అప్పగిస్తున్నాడన్నారు. ప్రజలు మతోన్మాద పార్టీలకు గోరికట్టి, విప్లవ పార్టీల వైపు నిలవాన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవారం, ఏఐకెపిఎస్ జిల్లా కార్యదర్శి సురేష్, ఐఎస్ టియు జిల్లా అధ్యక్షులు ముత్తేన్న, సహాయ కార్యదర్శి రమేష్, పార్టీ డివిజన్ నాయకులు దామోదర్, బాబన్న, పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు నరేందర్, పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు అనీస్, పిఓడబ్ల్యు జిల్లా నాయకురాలు రమ, సీపీఐ ( ఎంఎల్ ) మాస్ లైన్ (ప్రజాపంథా) మండల కార్యదర్శి అశోక్, నాయకులు రమేష్, వెల్డింగ్ రాజు తదితరులు పాల్గొన్నారు.