– ఎంపీడీవో సుమణ వాణి
– అందరూ హాజరు కావాలి
నవతెలంగాణ – తాడ్వాయి
నేడు మంగళవారం ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం తడువాయిలో ఉదయం 8 గంటలకు పతాకావిష్కరణ ఉంటుందని అందరు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని మండల అభివృద్ధి అధికారి సుమణ వాణి తెలిపారు. మండలంలో అధికారులు ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు యూత్ సంఘాలు వివిధ కార్మిక సంఘాలు ప్రజలు మహిళలు మేధావులు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు.