పిల్లల అక్రమ రవాణాలో యూపీ టాప్‌

UP top in child trafficking – 2, 3 స్థానాల్లో బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌
– హోటళ్లు, దాబాల్లోనే అత్యధికంగా బాల కార్మికులు
న్యూఢిల్లీ : పిల్లల అక్రమ రవాణాలో బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్‌లో తొలి స్థానంలో ఉందని ఓ ఎన్జీఓ సంస్థ అధ్యయనంలో వెల్ల డైంది. 2, 3 స్థానాల్లో బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌ పిల్లల అక్రమ రవాణాలో యూపీ టాప్‌ ఉన్నాయి : కరోనా ముందు, అనంతర కాలంలో ఢిల్లీలో పిల్లల అక్రమ రవాణా కేసుల్లో 68 శాతం పెరుగుదల నమోదైనట్టు తెలిపింది. ప్రపంచ మానవుల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆదివారం ఈ నివేదికను విడుదల చేసింది. గేమ్స్‌ 24/7, నోబెల్‌ బహుమతి గ్రహీత కైలాష్‌ సత్యార్థికి చెందిన చిల్డ్రన్స్‌ ఫౌండేషన్‌ (కేఎస్‌సీఎఫ్‌) సంయుక్తంగా 21 రాష్ట్రాల్లోని 262 జిల్లాల్లో ”చైల్డ్‌ ట్రాఫికింగ్‌ ఇన్‌ ఇండియా : ఇన్‌సైట్స్‌ ఫ్రమ్‌ సిట్యుయేషనల్‌ డేటా అనాలసిస్‌ అండ్‌ ది నీడ్‌ ఫర్‌ టెక్‌ డ్రైవెన్‌ ఇంటర్వెన్షన్‌ స్ట్రాటజీస్‌ ” అంశంపై అధ్యయనం చేశాయి.2016 – 2022 మధ్య కాలంలో అత్యధికంగా పిల్లల అక్రమ రవాణా జరిగిన తొలి మూడు రాష్ట్రాల్లో యూపీ, బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నాయని ఆ అధ్యయనం పేర్కొంది. 18 ఏండ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న 13,549 మంది పిల్లలు రక్షించినట్టు తెలిపింది. రక్షించిన చిన్నారుల్లో 80 శాతం మంది 13 నుంచి 18 ఏండ్ల వయసులోపు వారు ఉండగా, 13 శాతం మంది తొమ్మిదేండ్ల నుంచి 12 ఏండ్లలోపు వారు ఉన్నారని, రెండు శాతానికి పైగా తొమ్మిదేండ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారు ఉన్నారని నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇది విస్తృతమైన సమస్యగా మారుతుందని సూచించింది. పిల్లల అక్రమ రవాణా వివిధ వయసుల పిల్లలను ప్రభావితం చేస్తుందని, ఇది విస్తృతమైన సమస్యగా మారుతుందని తెలిపింది. బాలకార్మికులు ఎక్కువగా ఉన్న పరిశ్రమల వివరాలను నివేదిక వెల్లడించింది. హోటళ్లు, దాబాల్లో గరిష్ట సంఖ్యలో 15.6 శాతం బాల కార్మికులు పనిచేస్తున్నారని, ఆటోమొబైల్‌ లేదా రవాణా పరిశ్రమలో 13 శాతం, గార్మెంట్స్‌లో 11.18 శాతం మంది పనిచేస్తున్నారు. ఐదు నుంచి ఎనిమిదేండ్ల లోపు పిల్లలు కాస్మెటిక్స్‌ పరిశ్రమలో ఉన్నారని నివేదిక పేర్కొంది. విధ రాష్ట్రాలో పిల్లల అక్రమ రవాణా కేసుల్లో పెరుగుదల ఉన్నప్పటికీ, ఉత్తరప్రదేశ్‌లో ఆ సంఖ్య గణనీయంగా ఉందని తెలిపింది. ప్రీ-కోవిడ్‌ దశలో 2016-2019 మధ్య 267 సంఘటనలు, కోవిడ్‌ అనంతర దశలో 2021-2022 మధ్య 1214 సంఘటనలకు పెరిగింది. కర్నాటకలో 18 రెట్లు పెరిగి, 6 నుంచి 110 సంఘటనలు నమోదయ్యాయి. అయినప్పటికీ ప్రభుత్వాలు, వివిధ సంస్థలు బాల కార్మిక వ్యవస్థకు అడ్డుకట్టవేసేందుకు ప్రయత్నించాయని నివేదిక తెలిపింది. పిల్లల అక్రమ రవాణాను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సమగ్రమైన అక్రమ రవాణా నిరోధక చట్టం అత్యవసరంగా తీసుకురావాలని నివేదిక పేర్కొంది.