నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం డిఎ, పిఆర్ సి పెండింగ్ బిల్లుల తక్షణ పరిష్కారం కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాద్యాయ ధర్మా గ్రహ దీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్ జీ ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మండల శాఖ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షులు కిషన్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ఓల్డ్ పెన్షన్, కామన్ సర్వీసెస్ రూల్స్, పెండింగ్ డిఎ లు, పి ఆర్ సి అమల్లోకి తీసుకురావడం వంటి హామీలను తక్షణం అమలు చేయాలని తపస్ డిమాండ్ చేస్తుంది అన్నారు. ఈనెల 28న తహసిల్దార్ లకు వినతి పత్రాన్ని సమర్పణ, నవంబర్ 5న కలెక్టరేట్ వద్ద ధర్నా, నవంబర్ 23న చలో ఇందిరా పార్క్ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఆందోళన కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డివిజన్ కార్యదర్శులు శంకర్ గౌడ్, ఆనంద్, మండల కార్యదర్శి రమేష్, మాసం శ్రీనివాస్, జి. రవీందర్, సాంబార్ కిషన్, తదితరులు పాల్గొన్నారు.