– సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తిరుమల్‌రెడ్డి ఇన్నా రెడ్డి ఖరారైనట్టు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ (సీపీఎస్) యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై యూనియన్‌లో చర్చించామని పేర్కొన్నారు. సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్‌గౌడ్ హజరైనట్టు తెలిపారు. 28 ఏండ్లుగా తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి ఉపాధ్యాయులకు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఎస్ అధ్యాపకున్ని, మరోవైపు పాత పెన్షన్‌లో ఉన్న ఉపాధ్యాయున్ని అభ్యర్థులుగా పోటీలో నిలిపి, సీపీఎస్ ఓపీఎస్ అనే తేడా లేకుండా ఉపాధ్యాయ వర్గం నుండి పెట్టుబడిదారి పెన్షన్ విధానాన్ని పారదోలేందుకు సీపీఎస్ విధానంపై రెఫరెండంగా ఎన్నికల్లో బరిలో ఉంటున్నామని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పవన్‌కుమార్, పోల శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లి కార్జున్, రాజేష్ వనమాల, సిర్పూర్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.