కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన కుర్లా గ్రామ ఉపసర్పంచ్

నవతెలంగాణ- మద్నూర్ :
నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండలంలోని కుర్లా గ్రామ ఉప సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అశోక్ పటేల్ గురువారం నాడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జుక్కల్ ఎమ్మెల్యే హనుమాన్త్ షిండే ఎన్నికల ప్రచారంలో భాగంగా కుర్ల గ్రామంలో ప్రచారం నిర్వహించగా కుర్లా గ్రామ ఉపసర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు కుర్లా గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉండగా ఆ పార్టీ ఉప సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఆ పార్టీకి బలం చేకూరినట్లు అయింది పార్టీలో చేరిన ఉప సర్పంచ్ కు ఎమ్మెల్యే హనుమంతు సిండే బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.