
ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవుతాపురం పంచాయతీ కార్యదర్శి ఉపేందర్, డాక్టర్ నిఖత్ అన్నారు. జన వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, లక్ష్మీ నరసింహ హాస్పిటల్ హనుమకొండ వారి సహకారంతో శుక్రవారం గ్రామంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డాక్టర్ నిఖత్ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో జన వికాస సంస్థ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విష జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జన వికాస కోఆర్డినేటర్ రమ, శైలజ శోభారాణి, సులోచన దేవి, కారోబార్ యాకూబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.