వాయిస్‌తోనూ యూపీఐ చెల్లింపులు

UPI Payments with Voice–  అభివృద్థి చేసిన ఎన్‌పీసీఐ
న్యూఢిల్లీ : యుపిఐ యాప్‌ల ద్వారా ఇకపై వాయిస్‌తోనూ నగదు చెల్లింపులు జరిపేలా నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) టెక్నలాజీని అభివృద్థి చేసింది. కత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థతో సంభాషించడం ద్వారా లావాదేవీలు పూర్తి చేయవచ్చు. ఈ సౌలభ్యాన్ని ‘గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ 2023’లో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ లాంచనంగా ఆవిష్కరించారు. యూపీఐ, యూపీఐ లైట్‌ ఎక్స్‌్‌, ట్యాప్‌అండ్‌పే, వాయిస్‌ ద్వారా చెల్లింపుల కోసం హలో యూపీఐ, బిల్‌పే కనెక్ట్‌ తదితర ఐదు చెల్లింపు విధానాలను అందుబాటులోకి తెచ్చినట్లు శక్తికాంత దాస్‌ వెల్లడించారు. యూపీఐ లైట్‌ఎక్స్‌ ద్వారా ఇంటర్నెట్‌ లేకపోయిన చెల్లింపులు చేయడానికి వీలుందన్నారు. యూపీఐ క్రెడిట్‌ లైన్‌ ద్వారా బ్యాంకులు ముందుగా మంజూరు చేసిన రుణ పరిమితిని ఉపయోగించుకోవచ్చన్నారు.