– బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ-కౌటాల
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేసేల ఎత్తిపోతల పథకం అందుబాటులోకి తేవాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని పలు ఎత్తిపోతలను సందర్శించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాండ్గాం గ్రామపంచాయతీలో 2009 సంవత్సరంలో ఇక్కడ ప్రాణహిత నది ఒడ్డు మీద దాదాపుగా 8 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందన్నారు. ఈ 8 లెఫ్ట్ ఇరిగేషన్ స్కీం ఈరోజు పని చేయడం లేదన్నారు. ప్రాణహితలో పుష్కలంగా నీల్లున్నాయని కానీ పక్కన పత్తి ఎండి పోతుందని తెలిపారు. రైతులు విత్తనాలు వేసి వాన కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ ఒక్క లెఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 5000 ఎకరాలకు నీళ్లు అందుతాయన్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో మోటార్లు చెడిపోయి, వాటిని రిపేర్ చేయక, కొత్త మెషిన్లు పెట్టక దాదాపుగా ఏడు ఎనిమిది ఏండ్లు అయ్యాయని తెలిపారు. లిఫ్ట్ ఇరిగేషన్ మరమత్తుకు కావాల్సిన సగం ఖర్చును రైతులు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుండి పట్టించుకునే నాధుడే లేడన్నారు. ఉత్తం కుమార్ రేవంత్ రెడ్డి మీరు ఫామ్ హౌస్‌లో ఒకరోజు చేసుకునే విందు ఖర్చుతో ఈ లెఫ్ట్ ఇరిగేషన్లన్నీ రిపేర్ చేయవచ్చని అన్నారు. ఒకవేళ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ రిపేర్ చేయకపోతే పార్టీలకు అతీతంగా రైతులతో కలిసి ఆందోళనలు చేపడుతామన్నారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ మండల నాయకులు ఉన్నారు.